సుప్రీంకోర్టునే బెదిరించడానికి అమిత్ షాకు ఎన్ని గుండెలు?: పినరయి విజయన్
- శబరిమలలో మహిళల ప్రవేశాన్ని బీజేపీ, ఆరెస్సెస్ లు అడ్డుకుంటున్నాయి
- కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమిత్ షా కుట్రలు చేస్తున్నారు
- రాష్ట్రంలో అడుగు మోపేంత స్థలం కూడా వారికి లేదు
శబరిమలలో మహిళలు ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యతిరేకిస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. ఆలయానికి వెళ్లేందుకు యత్నించిన మహిళలపై బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు దాడికి తెగబడ్డాయని అన్నారు. సుప్రీంకోర్టునే బెదిరించేందుకు అమిత్ షాకు ఎన్ని గుండెలు? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమిత్ షా కుట్రలు చేస్తున్నారని... ఆయనకు ఉన్న బలం దానికి సరిపోదని విజయన్ అన్నారు. ఆయన శరీరం నీటితో నిండి ఉందని... తమ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పనులు గుజరాత్ లో చేసుకుంటే మేలని హితవు పలికారు. కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమిత్ షా కలలు కంటున్నారని... రాష్ట్రంలో అడుగు మోపేంత స్థలం కూడా వారికి లేదని అన్నారు. బీజేపీకి కేరళలో స్థానం లేదని చెప్పారు.